విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

V6 Velugu Posted on May 25, 2021

విశాఖపట్టణం: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషణ్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఆకాశంలోకి దట్టమైన పొగ వ్యాపిస్తోంది. పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ప్రమాద తీవ్రతను తెలియజేస్తూ సంస్థ సైరన్ ను మూడు సార్లు మోగించారు. దీంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. HPCL పాత టెర్మినల్ లోని... సిడియు యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. పాత టెర్మినల్ లో పనిచేస్తున్న కార్మికులను బైటకు పంపించేశారు అధికారులు. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

Tagged , Visakhapatnam HPCL Refinery, vizag hpcl, vizag hpcl refinery, massive fire accident, hpcl fire accident, visakha today

Latest Videos

Subscribe Now

More News