టాటా కార్లపై మస్తు ఆఫర్లు.. రూ.48 వేల వరకు డిస్కౌంట్లు

టాటా కార్లపై మస్తు ఆఫర్లు..  రూ.48 వేల వరకు డిస్కౌంట్లు

న్యూఢిల్లీ: టియాగో, టైగర్​, ఆల్ట్రోజ్​, హారియర్, సఫారీ మోడల్స్​పై టాటా మోటర్స్​ ఆఫర్లను ప్రకటించింది. ఈ  నెలాఖరు వరకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. డీజిల్​, పెట్రోల్​, సీఎన్‌‌జీ  వెర్షన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. డిస్కౌంట్లు రూ.25 వేల నుంచి రూ.48 వేల వరకు ఉన్నాయి. 

 
టియాగో


టియాగో  పెట్రోల్ వేరియంట్​పై కస్టమర్లు గరిష్టంగా రూ.30వేల డిస్కౌంట్​ను పొందవచ్చు. వీటిలో రూ.10 వేల వరకు ఎక్స్ఛేంజ్  డిస్కౌంట్లు,  రూ.20 వేల వరకు విలువైన కన్జూమర్ ​స్కీమ్స్​ ఉంటాయి. సీఎన్​జీ వెర్షన్​పై గరిష్టంగా రూ.43వేల వరకు డిస్కౌంట్​ ఇస్తారు. ఇందులో రూ.30వేల వరకు కన్జూమర్​ స్కీమ్ డిస్కౌంట్​, రూ.10వేల వరకు ఎక్స్‌‌‌‌‌‌‌‌ఛేంజ్ డిస్కౌంట్,​  రూ.3 వేల వరకు విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.


టిగోర్


టాటా టిగోర్  పెట్రోల్ వేరియంట్‌‌‌‌‌‌‌‌లపై కస్టమర్‌‌‌‌‌‌‌‌లు గరిష్టంగా రూ.33వేల వరకు డిస్కౌంట్​ను పొందవచ్చు.   సీఎన్​జీ మోడల్​ను మొత్తం రూ.48వేల వరకు డిస్కౌంట్​తో అందిస్తున్నారు.  పెట్రోల్  సీఎన్​జీ మోడల్స్ రెండింటికీ  ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కన్జూమర్​ స్కీమ్స్​,  కార్పొరేట్ డిస్కౌంట్స్​ ఉంటాయి. 


ఆల్ట్రోజ్


ఈ హ్యాచ్‌‌‌‌‌‌‌‌బ్యాక్ కారు  పెట్రోల్,  డీజిల్ వెర్షన్‌‌‌‌‌‌‌‌లపై డిస్కౌంట్లు ఉన్నాయి. ఇటీవల లాంచ్​ చేసిన ఆల్ట్రోజ్​ సీఎన్​జీ మోడల్‌‌‌‌‌‌‌‌పై మాత్రం ఆఫర్లు లేవు. ఎక్స్​ఈ,  ఎక్స్​ఈ+ ట్రిమ్‌‌‌‌‌‌‌‌లు మినహా పెట్రోల్ వేరియంట్లపై గరిష్టంగా రూ.25వేల డిస్కౌంట్​ పొందవచ్చు. ఎక్స్​ఈ,  ఎక్స్​ఈ+ ట్రిమ్‌‌‌‌‌‌‌‌లపై మొత్తం రూ.10వేల వరకు డిస్కౌంట్​ను దక్కించుకోవచ్చు.  అన్ని డీజిల్ వేరియంట్లపై రూ.30వేల వరకు డిస్కౌంట్​ ఉంది.


హారియర్​,  సఫారీ


టాటా  హారియర్,  సఫారీ ఎస్​యూవీలపై కస్టమర్లు గరిష్టంగా రూ.35 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎస్​యూవీలు రూ.25వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్,  రూ.10వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్​తో వస్తాయి. అన్ని వేరియంట్లకు ఆఫర్లు వర్తిస్తాయి. ఈ రెండు వెహికల్స్​పై కంపెనీ కన్జూమర్ ​స్కీమ్స్​ ఏవీ లేవు.