కొబ్బరి చిప్ప తాకి ఆటో బోల్తా… MBA విద్యార్థిని మృతి

కొబ్బరి చిప్ప తాకి ఆటో బోల్తా… MBA విద్యార్థిని మృతి

కొబ్బరి చిప్ప ఆటోల వెళ్తుతున్న ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. ఎంబీఏ ఎగ్జామ్ రాసిన ఓ విద్యార్థిని ఆటోల వెళ్తుండగా దారి మధ్యలో ఎవరో కొట్టిన కొబ్బరి చిప్ప ఆటోకు తాకడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

రొద్దం మండలం సోలేమర్రి గ్రామానికి చెందిన అశ్విని అనంతపురంలోని సీఆర్ఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతుంది. బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలోని షిరిడి సాయి ఇంజినీరింగ్ కాలేజీలో ఎంబీఏ సప్లమెంటరీ ఎగ్జామ్  రాసి తిరిగి అనంతపురం వచ్చేందుకు ఓ ఆటో ఎక్కింది. ఆటో వస్తుండగా దారి మధ్యలో ఎవరో దిష్టి మొక్కు తీర్చుకునేందుకు  కొబ్బరికాయను రోడ్డుపై కొట్టారు. ఆ కొబ్బరి కాయ ముక్కలు స్పీడ్ తో వచ్చి అశ్విని వెళ్తున్న ఆటోకి తాకాయి. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అశ్వినితో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని అనంతపురంలోని సర్వజన హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్న అశ్విని మృతి చెందింది. మిగతా వారు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.