మీల్‌ మేకర్‌‌ మంచి హెల్దీ ఫుడ్

మీల్‌ మేకర్‌‌ మంచి హెల్దీ ఫుడ్

మీల్‌‌మేకర్​లో శరీరానికి కావల్సినన్ని పోషక విలువలు ఉన్నాయి. అసలు వీటిని ఎలా తయారుచేస్తారో తెలుసా? సోయాబీన్స్‌‌ నుండి ఆయిల్‌‌ను బయటికి తీసిన తర్వాత దాన్లో మిగిలిన పీచునుండి మీల్‌‌మేకర్‌‌‌‌ తయారుచేస్తారు. వీటివల్ల శరీరానికి కలిగే లాభాలు బోలెడు. అవేంటంటే...

మీల్‌‌మేకర్‌‌‌‌ను ఫుడ్‌‌లో చాలా రకాలుగా వాడతారు. వీటిని వాడే ముందు చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టాలి. తరువాత కావల్సిన విధంగా వాడేయొచ్చు. ఎలా వాడినా వాటిలో ఉన్న పోషక విలువలు మాత్రం ఎక్కడికి పోవు.మీల్‌‌మేకర్‌‌‌‌లో అన్ని రకాల అమైనోయాసిడ్స్‌‌ ఉంటాయి. ఇవి తిన్న ఫుడ్‌‌ను తొందరగా అరిగిస్తాయి. అందుకని గ్యాస్టిక్‌‌ ప్రాబ్లమ్‌‌ ఉన్నవాళ్లు వీటిని తింటే ఇబ్బంది ఉండదు. మీల్‌‌మేకర్‌‌లో ఎక్కువగా  క్యాల్షియం ఉంటుంది. దానివల్ల ఎముకలు స్ట్రాంగ్‌‌ అవుతాయి. వీటిని చిన్న పిల్లలకు పెడితే  హైట్‌‌, మజిల్‌‌ గ్రోత్‌‌ బాగా ఉంటుంది. బాడీబిల్డింగ్‌‌ కోసం చూసేవాళ్లు మీల్‌‌మేకర్‌‌‌‌ను వాళ్ల డైట్‌‌లో చేర్చుకోవడం బెటర్‌‌‌‌.

ప్రొటీన్స్‌‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌‌ మీల్‌‌మేకర్‌‌‌‌. పప్పులు, మాంసాల్లో ఉండే దాని కన్నా వీటిలోనే ఎక్కువ ప్రొటీన్స్‌‌ ఉంటాయి. 100 గ్రాముల సోయాబీన్స్‌‌లో 43 గ్రాముల ప్రోటీన్‌‌ ఉంటుంది. మీల్‌‌మేకర్‌‌‌‌లో బి–కాంప్లెక్స్‌‌ విటమిన్‌‌ ఉంటుంది. ఇది పూర్‌‌‌‌ డైట్‌‌ వల్ల వచ్చే విటమిన్‌‌ డెఫిషియెన్సిని తగ్గిస్తుంది. విటమిన్‌‌  బి, సి బాడీ టిష్యూలను రిపేర్‌‌‌‌ చేసి ఇమ్యూనిటీ సిస్టమ్‌‌ను మెరుగుపరుస్తాయి. బ్రెయిన్‌‌ ఫంక్షన్‌‌ సరిగా జరిగేలా చేసి, శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. మీల్‌‌మేకర్‌‌‌‌ అలర్జీలు రాకుండా చేస్తాయి. ఇవి తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

వీటిలో ఉండే ఒమెగా–3 ఫ్యాటీయాసిడ్స్‌‌ తిన్న ఫుడ్‌‌ నుండి న్యూట్రియెంట్స్‌‌ను గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు అందిస్తాయి. ఇమ్యూనిటీ పవర్‌‌‌‌ను పెంచుతాయి. ఫాస్ఫరస్ బాడీలోని సెల్స్‌‌, టిష్యూలను రిపేర్‌‌‌‌ చేస్తుంది. బ్లడ్‌‌లో ఉండే చెడు కొలెస్ట్రాల్‌‌ తగ్గించి హార్ట్‌‌ ఎటాక్ రాకుండా కాపాడతాయి. డయాబెటిస్‌‌ ఉన్నవాళ్లూ తినొచ్చు. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇవి మంచి డైట్‌‌. ఆడవాళ్లకు సాయంచేసే ఈస్త్రోజన్‌‌ వీటిలో కావలసినంత ఉంది. 25 గ్రాముల మీల్‌‌మేకర్‌‌‌‌ లో 13గ్రా. ప్రొటీన్‌‌, 
8గ్రా. పిండి పదార్థాలు, 3గ్రా. ఫైబర్, 80గ్రా. క్యాల్షియం ఉంటాయి. 

మరిన్ని వార్తల కోసం:

డేరా బాబాకు పెరోల్

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ