Good News:   ఏపీ నిరుద్యోగులకు శుభవార్త:  16వేల 347 టీచర్​ పోస్టులు భర్తీ

Good News:   ఏపీ నిరుద్యోగులకు శుభవార్త:  16వేల 347 టీచర్​ పోస్టులు భర్తీ

ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఎన్నికల హామీలో భాగంగా మెగా డీఎస్సీపై తన రాజ ముద్ర వేశారు. మాజీ సీఎం జగన్ ఇచ్చిన 6 వేల డీఎస్సీ నోటిఫికేషన్ పై నిరుద్యోగులపై తీవ్ర నిరసనలు, వ్యతిరేకత రావటంతో.. అప్పట్లో చంద్రబాబు మెగా డీఎస్సీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని హామీ ఇచ్చారు.

చంద్రబాబు అనుకున్నట్లుగానే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మేనిఫెస్టోలో పెట్టినట్లే.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేశారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. మొత్తం 16 వేల 347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది కొన్ని రోజుల్లోనే వెలువడనుంది. 16 వేల 347 డీఎస్సీ పోస్టులపై సీఎం చంద్రబాబు సంతకం చేయగానే.. నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అయ్యింది. 

ఇక 16 వేల 347 టీచర్ ఉద్యోగాలకు సంబంధించి.. ఇందులో  ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు వెయ్యి 781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలు 586, సెకండరీ గ్రేడ్ టీచర్  పోస్టులు 6 వేల 371, డ్రిల్ మాస్టర్ ఉద్యోగాలు 132, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 7 వేల 725, ప్రిన్సిపాల్ పోస్టులు 52 భర్తీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు.