చిరంజీవి, నయనతార 'MEGA157' సాంగ్ లీక్.. చిత్ర యూనిట్ హెచ్చరిక!

చిరంజీవి, నయనతార 'MEGA157' సాంగ్ లీక్..  చిత్ర యూనిట్ హెచ్చరిక!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) , నయనతార ( Nayanthara ) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న  చిత్రం' MEGA157'.  దర్శకుడు అనిల్ రావిపూడి ( Anil Ravipudi )  డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.చాలా రోజుల తర్వాత  చిరంజీవి కామెడీ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుతుంది. కేరళలోని అందమైన లోకేషన్స్ లో చిరు-నయనల మధ్య రొమాంటిక్స్ సాంగ్ ఒకటి చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు , వీడియోలు లీకులు అయ్యాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ మారాయి. దీంతో మూవీ టీం సిరీయస్ అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీకులు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది.
 
మెగా157 సాంగ్ లీక్..
 'MEGA157' చిత్రానికి సంబంధించిన లీకులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మూవీ టీం ఒక ప్రకటన విడుదల చేసింది.  ఇలాంటి చర్యలు మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు.  లీకైన మెటీరియల్‌ను షేర్ చేయడం, అప్‌లోడ్ చేయడం వంటివి చేస్తున్న వారిపై కాపీరైట్ ఉల్లంఘన, పైరసీ నిరోధక చట్టాల కింద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఇది సృజనాత్మక ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుపై నిరంతరం కృషి చేస్తున్న  టీం మొత్తం చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసినట్లే అని వివరించారు. 

అలప్పుజలో నయనతారపై చిత్రీకరిస్తున్న ఒక పాట సన్నివేశం లీకైన 24 గంటల్లోపే ఈ ప్రకటన రావడం గమనార్హం.  'MEGA157' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అనిల్ రావిపూడి, చిరంజీవిల మొదటి కలయిక కాగా, నయనతారతో చిరంజీవికి ఇది 'సైరా నరసింహారెడ్డి' ,  'గాడ్‌ఫాదర్' తర్వాత మూడవ సినిమా. అనిల్ రావిపూడి గత విజయవంతమైన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తిరిగి వస్తున్నారు.  అయితే  ఇతర ప్రధాన తారాగణం వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..

ALSO READ : ఒక చేత్తో ఆటో డ్రైవింగ్.. మరో చేత్తో శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్.. ప్రయాణికుడు సీరియస్!

ఈ 'MEGA157'  చిత్రం షూటింగ్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైంది. 'సంక్రాంతికి వస్తున్నాం' విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో చిత్ర నిర్మాతలు 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, చిరంజీవి నటించిన మరో చిత్రం, ఎంతో కాలంగా వాయిదా పడుతున్న 'విశ్వంభర' విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ మేకర్స్ చూస్తున్నారు. 'MEGA157' లీకుల సమస్యపై చిత్ర బృందం తీసుకున్న ఈ కఠిన వైఖరి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎంతవరకు నిరోధిస్తుందో చూడాలి..