లేఖ పాత్రకు కనెక్ట్ అయ్యా : మెహ్రీన్

లేఖ పాత్రకు కనెక్ట్ అయ్యా : మెహ్రీన్

‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటున్న మెహ్రీన్ నటించిన తాజా చిత్రం ‘స్పార్క్’. విక్రాంత్ హీరోగా, దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మెహ్రీన్  ఇలా ముచ్చటించింది.

‘ఈ స్ర్కిప్ట్ చాలా  కొత్తగా ఉంటుంది. ఇందులో లేఖ పాత్రలో కనిపిస్తా. ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ నాది. నాతోనే మూవీ స్టార్ట్ అవుతుంది. నాతోనే ఎండ్ అవుతుంది. ఇలాంటి థ్రిల్లర్‌‌లో నటించటం కొత్తగా అనిపించింది. ప్రతీ మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే కలలు కంటుంటారు. నేను కూడా అంతే. 

ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అందుకే బాగా కనెక్ట్ అయ్యాను.  యు.ఎస్‌‌లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌‌ను మిక్స్ చేసి థ్రిల్లర్ మూవీగా విక్రాంత్ తెరకెక్కించారు. తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం చాలా కష్టం. కానీ విక్రాంత్ ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాను కంప్లీట్ చేశారు.  ప్రస్తుతం తమిళంలో వసంత్ రవితో కలిసి ఓ థ్రిల్లర్‌‌‌‌ మూవీలో నటిస్తున్నా’.