అక్టోబర్ ఒకటి వరకు హైదరాబాద్, తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉంటాయి

అక్టోబర్ ఒకటి వరకు హైదరాబాద్, తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉంటాయి

హైదరాబాద్ : అక్టోబర్ 1వ తేదీ వరకు హైదరాబాద్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెళ్లిపోకముందే సెప్టెంబర్ లో హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్నారు. సెప్టెంబర్ 21 నుండి రుతుపవనాలు మరింత విస్తరించి.. నెలాఖరు వరకు చురుగ్గా ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 22 నుంచి 28వ తేదీల మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి వచ్చే నెలలో అంటే అక్టోబర్ 5 లేదా 6వ తేదీ వరకు వర్షాలు బాగానే కురుస్తాయని చెబుతున్నారు.

నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 6 నుంచి12 మధ్య వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో తెలంగాణలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేసింది. IMD అంచనా ప్రకారం.. సెప్టెంబర్ 15 నుండి 21వ తేదీ వరకు తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా. ఈ తుఫాను సెప్టెంబర్ 22 నుండి 28వ తేదీ వరకు ఉత్తర బంగాళాఖాతం ..పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని అంచనా వేస్తోంది.  

ఇప్పటివరకు 33 జిల్లాల్లో రెండు జిల్లాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, ఎనిమిది జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఇక మూడు జిల్లాల్లో గత వారం రోజులుగా భారీ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల సమయంలో తెలంగాణలో సాధారణ  వర్షపాతం నమోదైంది.  ప్రస్తుతం.. భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో బలహీనమైన ఎల్ నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఎన్ నినో పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు. 

ALSO READ: భట్టి విక్రమార్క దళిత దొర : లింగాల కమల్​రాజు
 

ఎల్ నినో సాధారణంగా భారతీయ రుతుపవనాలతో సహా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది.రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్‌లో చాలా తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనా వేసింది.