
ఒక్కోసారి కొన్ని ఆసనాలు పల్టీ కొట్టిస్తాయి. ఇలాంటిదే ఆ యోగా పోజు. మెక్సికోకు చెందిన అలెక్సా టెర్రాజ అనే యువతి 80 అడుగుల ఎత్తున్న ఆరో అంతస్తు బాల్కనీ ర్యాంప్‌పై యోగాసనం వేయబోయింది. ఇంకేముంది చెయ్యి జారి కింద పడింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పినా 110 ఎముకలు విరగొట్టుకుంది. మెక్సికోలోని సాన్‌పెడ్రోలో జరిగిన ఈ ఘటనను ఆ అమ్మాయి ఫ్రెండ్ క్లిక్‌మనిపించింది. ఎన్ని బొక్కలు విరిగాయో తెలియడానికి 11 గంటలు పట్టిందట. నడవడానికి మూడేళ్లు పడుతుందట.