మైక్రోసాఫ్ట్ లింక్ టు విండోస్ ఫీచర్

మైక్రోసాఫ్ట్ లింక్ టు విండోస్ ఫీచర్

విండోస్, ఆండ్రాయిడ్ మొబైల్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ ‘లింక్ టు విండోస్’ అనే కొత్త అప్ డేట్ ని తీసుకురానుంది. విండోస్ కు మొబైల్ ని కనెక్ట్ చేసి వర్డ్ డాక్యుమెంట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈజీగా వాడుకునేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది.

విండోస్ లో ఆఫీస్ వర్క్ చేసేవాళ్లు మొబైల్ నుంచి సిస్టమ్ కి ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిపడాలి. జీ మెయిల్ లాగిన్ అయి లేదా వెబ్ వాట్సాప్ కనెక్ట్ చేసుకొని వర్క్ చేసుకుంటారు యూజర్లు. అయితే మైక్రోసాఫ్ట్ తెస్తున్న లింక్ టు విండోస్ ఫీచర్ తో ఆ ఇబ్బందులన్నీ పోతాయి. వెబ్ వాట్సా్ప్ తరహాలోనే వర్డ్, పవర్ పాయింట్ లో స్కానర్, షేర్ ఆప్షన్ తీసుకొస్తుంది మైక్రోసాఫ్ట్. ఆ ఆప్షన్ తో మొబైల్ నుంచి వర్డ్, పవర్ పాయింట్ కి నేరుగా ఫైల్స్, ఫొటోస్, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు. కానీ, ఈ లింక్ టు విండోస్ ఫీచర్ కేవలం విండోస్ 10, విండోస్ 11 లేటెస్ట్ వెర్షన్ వాడుతున్న వాళ్లలో మాత్రమే పనిచేస్తుంది.