పాల ప్రొడక్ట్లకు పెరిగిన డిమాండ్

పాల ప్రొడక్ట్లకు పెరిగిన డిమాండ్
  • పాల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పెరిగిన డిమాండ్‌‌‌‌‌‌‌‌
  • సేకరణ ఖర్చులు ఎక్కువవ్వడంతోనూ..
  • ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్‌‌లో వెల్లడి

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:వంట నూనె, టమోటాలు, గోధుమలు ఇలా అన్ని రకాల ఆహార పదార్ధాల రేట్లు ఇప్పటికే పెరిగి  సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయి. పాల రేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశం మొత్తం మీద చూస్తే పాల రేట్లు ఈ ఏడాదియావరేజ్‌‌‌‌గా 5.8 % (ఏడాది ప్రాతిపదికన) మేర పెరిగాయి. అదే దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే 3.4 % మేర పెరిగాయి. రానున్న కాలంలో రేట్లు మరింత ఎక్కువవుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అమూల్‌‌‌‌, విజయా డెయిరీ, మదర్ ఇండియా వంటి  కంపెనీలు తమ పాల ప్యాకెట్ల రేట్లను పెంచాయి. తాజాగా  పాలకు డిమాండ్ పెరగడం, పాల ఉత్పత్తిలో పీక్ సీజన్‌‌‌‌ను దాటేయడం, పశువులకు వేసే దాణా ఖర్చులు పెరగడంతో పాల రేట్లు ఎక్కువవుతాయని ఎనలిస్టులు అంటున్నారు. హీట్‌‌‌‌వేవ్స్‌‌‌‌  పెరగడంతో దేశంలో పాలకు డిమాండ్ ఎక్కువయ్యిందని చెబుతున్నారు. 

హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లలో  పెరిగిన వినియోగం..
పశువుల దాణా పెరగడంతో పాల సేకరణ ఖరీదుగా మారింది. ఇప్పటికే పాలను అమ్మే కంపెనీలు గత ఐదు నెలల్లో పాల రేట్లను 5–8 % మేర పెంచాయి. ‘పాల సేకరణ ఖర్చులు పెరగడంతో ఈ భారాన్ని కస్టమర్లకు కంపెనీలు బదలాయించాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో డెయిరీ కంపెనీలు పాల రేట్లను మరింత పెంచుతాయి’ అని బ్రోకరేజ్‌ కంపెనీ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌‌‌ వివరించింది.  మిల్క్ పౌడర్‌‌‌‌‌‌‌‌ రేట్లు గ్లోబల్‌‌‌‌గా పెరిగాయని, పశువుల దాణా రేట్లు కూడా ఎక్కువయ్యాయని పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాల రేట్లు ఎక్కువగానే ఉంటాయని తెలిపింది. ‘డెయిరీ కంపెనీలన్నీ ఇప్పటికే 5–8 % మేర పాల రేట్లను పెంచాయి. అయినప్పటికీ, పాల సేకరణ ఖర్చులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పాల రేట్లను డెయిరీ కంపెనీలు మరింత పెంచుతాయని అంచనా వేస్తున్నాం’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లు వంటి ఇండ్లకు వెలుపల ప్లేస్‌‌‌‌లలో కూడా పాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీంతో  పాలకు డిమాండ్‌‌‌‌ ఎక్కువయ్యిందని,  పాలను సేకరించడంపై హీట్‌‌‌‌వేవ్స్ ప్రభావం పడుతోందని ఈ బ్రోకరేజి పేర్కొంది. గ్లోబల్‌‌‌‌గా మిల్క్ పౌడర్ రేట్లు గత ఏడాది కాలంలో 26.3 % (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి.  నెలవారీగా చూస్తూ జూన్‌‌‌‌ నెలలో 3 % పెరిగాయి. డెయిరీ కంపెనీల రెవెన్యూ భారీగా పెరుగుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌‌‌ వివరించింది. కానీ, పాల సేకరణ ఖర్చులు, ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌ ఖర్చులు, ప్యాకేజింగ్‌‌‌‌ ఖర్చులు  పెరగడంతో లాభాల్లో కొంత కోత ఉండొచ్చని పేర్కొంది. టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం వలన ఈ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లు, పెరుగు, ఇతర మిల్క్ ప్రొడక్ట్‌‌‌‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని క్రిసిల్  పేర్కొంది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాల రేట్లు 13–14 శాతం పెరుగుతాయని అంచనా వేసింది.