
కామారెడ్డి/కోరుట్ల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్పార్టీదేనని, బీజేపీ డక్అవుట్అయితదని, కాంగ్రెస్ రన్ అవుట్అయితదని, కేసీఆర్ సిక్సర్క ఒట్టి హ్యాట్రిక్ సీఎం అవుతారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్అభ్యర్థులను ప్రకటించి 40 రోజులైనా కాంగ్రెస్‌ఇప్పటికీ టికెట్లు ఇయ్యలేకపోతున్నదన్నారు. టికెట్ల కోసం ఫీజు వసూలు చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకునే ప్రోగ్రామ్నడుస్తోందని విమర్శించారు. ఆయన శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్జిల్లాలో పర్యటించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిజామాబాద్జిల్లా ధర్పల్లిలో నిర్మించే100 పడకల హాస్పిటల్స్ కు, ధర్పల్లిలో సెంట్రల్ లైటింగ్, వాడిలో బ్రిడ్జి నిర్మాణం, చీమన్‌పల్లిలో పీహెచ్సీ భవనాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సభల్లో మాట్లాడారు. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తే లీడర్లు తన్నుకుంటారని, ఆఫీసులు పగులుతాయని, పైసలు తిన్న సంగతి బయట పడుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్లు భయపడుతున్నారన్నారు. టికెట్లే ఇచ్చుకోలేని పార్టీ రేపు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుందని ప్రశ్నించారు. గవర్నమెంట్స్కూల్పిల్లలకు పొద్దున బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పిల్లలకు గొడ్డుకారం, అన్నం మాత్రమే పెడుతుంటే కేసీఆర్మమకారంతో కూడిన ఆహారం ఇస్తున్నారన్నారు. అభివృద్ధికి కొనసాగించేందుకు మూడోసారి కూడా బీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్హాట్రిక్సీఎం అవుతారని అన్నారు. వేలాదిమందికి ఉపాధి ఇచ్చిన బీడీ కార్మికులకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్ హయాంలో బీడీ కట్టల మీద పుర్రె గుర్తు వేస్తే, బీజేపీ జీఎస్టీ విధించిందన్నారు. అలాంటి పార్టీలకు బీడీ కార్మికులు ఓట్లు ఎలా వేస్తారన్నారు.
పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం
పదేళ్ల బీఆర్ఎస్పాలనకు, గతంలో పదేళ్ల కాంగ్రెస్పాలనకు చర్చ పెడదామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, దీన్ని స్వాగతిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో రూ. 16.80 కోట్ల నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో మాట్లాడారు.
పాత పదేళ్ల పాలన బాగుందనీ రేవంత్‌రెడ్డి అంటున్నారని, అప్పుడు రేవంత్ టీడీపీలో ఉన్నారని, అసెంబ్లీ లో మాట్లాడిన రికార్డులు తీయాలన్నారు. గెలిచేది బీఆర్ఎస్ అని, హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆర్అని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ డక్అవుట్, కాంగ్రెస్రన్అవుట్అని, బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ సిక్సర్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.