కొల్లాపూర్ లో భూసేకరణను వేగవంతం చేయండి : జూపల్లి కృష్ణారావు

 కొల్లాపూర్ లో  భూసేకరణను వేగవంతం చేయండి : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ వెలుగు: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఇరిగేషన్​ పనులపై  హైదరాబాద్​లోని అంబేద్కర్​ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఇరిగేషన్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని సింగోటం జలాశయం, జూరాల ఎడమ కాలువ పరిధిలోని గోపాల్ దిన్నె జలాశయాల్ని కలిపే లింకు కెనాల్ ప‌‌నులగురించి ఆరాతీశారు. ఈ జలాశయాల ద్వారా 35వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, పెండింగ్​ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. 

.కెనాల్ ​పనులు స్లోగా సాగుతున్నాయని, వాటిని స్పీడప్​ చేయాలని చెప్పారు. భూసేకరణ, పరిహారం పై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పరిహారంపై ప్రపొజల్స్​ రూపొందించి, తనకు అందించాలన్నారు. కెనాల్​ పనులు పూర్తయితే ఆయ‌‌క‌‌ట్టు వ‌‌ర‌‌కు నీరందుతుంద‌‌ని పేర్కొన్నారు. స‌‌మీక్ష స‌‌మావేశంలో ఎస్​ఈ విజయ భాస్కర్​ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రావు పాల్గొన్నారు.