ఘనంగా మంత్రి కోమటిరెడ్డి బర్త్​డే వేడుకలు

 ఘనంగా మంత్రి కోమటిరెడ్డి బర్త్​డే వేడుకలు

నల్గొండ అర్బన్/చిట్యాల, వెలుగు: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి వెంకటరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. 

మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ..

మంత్రి కోమటిరెడ్డి కోమటిరెడ్డి బర్త్​డే వేడుకలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. కేక్  కట్ చేసి  స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్   వెంకట్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మండల అధ్యక్షురాలు గుడిపాటి లక్ష్మి, నరసింహ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, మాజీ జడ్పీటీసీ చేపూరి యాదయ్య, కాట వెంకటేశ్వర్లు, వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.