గుజరాత్ లో 13 సార్లు పేపర్ లీక్..మోడీని రాజీనామా అడిగే దమ్ముందా? : కేటీఆర్

గుజరాత్ లో 13 సార్లు పేపర్ లీక్..మోడీని రాజీనామా అడిగే దమ్ముందా? : కేటీఆర్

ప్రభుత్వ వ్యవస్థలపై బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని  మంత్రి కేటీఆర్  విమర్శించారు. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని మొత్తం వ్యవస్థకు ఆపాదిస్తున్నారని అన్నారు.  సంజయ్ నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో 13 సార్లు క్వశ్చన్ పేపర్ లీకైందని,మోడీని రాజీనామా చేయమనే దమ్ము సంజయ్ కు ఉందా.? అని ప్రశ్నించారు. సంజయ్ ఓ రాజకీయ అజ్ఞాని కేటీఆర్ అన్నారు.

టీఎస్పీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థ అని బండి సంజయ్ కు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు.  నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రెచ్చగొట్టే రాజకీయాలను పట్టించుకోకుండా యువత ఉద్యోగాల సాధనపైనే దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.