ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వాలె

ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వాలె

సిరిసిల్ల, వెలుగు: అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బుధ వారం బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. అలాగే, సిరిసిల్ల జిల్లాలో పంట నష్టంపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ ​పరిశీలించారని గుర్తు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలతో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉం డాలని కోరారు.