పెద్దపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టులు

పెద్దపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టులు

పెద్దపల్లి జిల్లాలో ఇవాళ ( అక్టోబర్ 1న) మంత్రి కేటీఆర్ పర్యటించున్నారు.  జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.  మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను ముందుస్తుగా  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.  గోదావరిఖనిలో  బీజేపీ,కాంగ్రెస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్ టీయూ  కార్మిక సంఘాల నాయకలతో పాటు డివైఎఫ్ఐ ,బీఎస్పీ నాయకులను అదుపులోకి తీసుకొని వన్ టౌన్  పోలీసు స్టేషన్ కు తరలించారు.  ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నారు ఆయా పార్టీల నేతలు.  

పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్బంగా  మంత్రి కేటీఆర్.. మొదట రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఐటీ పార్క్‌, అంతర్గాంలో నిర్మించనున్న ఇండస్ట్రియల్‌ పార్క్‌, 100 కోట్ల పైలాన్‌తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే రామగుండం దశాబ్ధి ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

అనంతరం అంతర్గాం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల్లో ఖురూజ్‌కమ్మీ భూములపై బాధితులకు మొదటి విడుతగా 600 మందికి భూ హక్కులు కల్పించనున్నారు. 58, 59,76 జీవోల ద్వారా రామగుండంలోని లబ్ధిదారులకు పట్టాలు, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌, 3425 మందికి 4 వేల చొప్పున పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పెద్దపల్లికి చేరుకుని, మున్సిపల్‌ పరిధిలో 25 కోట్ల టీఎఫ్‌ఐడీసీ నిధులతో రోడ్లు, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.