డ్రామాల్లో కేసీఆర్​కు ఆస్కార్ అవార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్​

 డ్రామాల్లో కేసీఆర్​కు ఆస్కార్ అవార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కరీంనగర్​ ఎంపీగా బండి సంజయ్​ ఏం చేశావ్: మంత్రి పొన్నం

హుస్నాబాద్​: రాష్ట్రంలో కరువు వచ్చిందని, వర్షాలు లేవని రైతులను ఆదుకోవాలని  కేసీఆర్, బండి సంజయ్ లు ఇక్కడ దీక్ష చేసే బదులు మోదీ దగ్గర దీక్ష చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇవాళ  ( ఏప్రిల్​ 2) సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్ లో  మార్నింగ్ వాక్  నిర్వహించారు. అనంతరం సర్దార్​ సర్వాయి పాపన్న వర్దంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రైతుల సమస్య మీద దీక్ష  చేస్తున్న బండిపై ఆయన తీవ్రస్థాయిలో మండిప్డడారు. 

ఐదేళ్లు కరీంనగర్ ఎంపీగా ప్రజా సమస్యలు  పట్టించుకోని బండి సంజయ్​ ఇప్పుడు రైతుసమస్యల మీద దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  రైతుల దగ్గర  మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన మోడీ దగ్గర ధర్నా చేసి కేంద్రం దగ్గర నిధులు తీసుకురావాలని బండికి సవాల్ విసిరారు. ఓట్ల కోసం మొన్నటి దాకా రాముడి ఫొటో పెట్టుకున్నారని ఆరోపించారు.  కల్లాల దగ్గర రైతులు కన్నీరు పెట్టుకున్నప్పుడు ఎక్కడ పోయావని బండిని నిలదీశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు ఎక్కడికి వెళ్లావని కేసీఆర్​ను నిలదీశారు.  రైతుల పేరుతో దీక్ష చేయడం సరికాదన్నారు.  కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న వ్యక్తులు కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు.  కాళేశ్వరం మునిగినప్పుడు, అధికారం పోయిన  తరువాత ఈ నాలుగు నెలలు ఎక్కడకు పోయారని కేసీఆర్​ను ప్రశ్నించారు. పొలం బాట పేరుతో కరువును రాజకీయాల కోసమే వాడుకుంటూ పొలాల దగ్గర రాజకీయం చేస్తున్నారన్నారు. ధర్నాల ,దీక్షల పేరుతో  డ్రామాలు చేయడంలో ఆస్కార్ అవార్డు గ్రహీతవని కేసీఆర్​ను ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు    గ్రామ ఆర్టిస్ట్ లా డ్రామాలు స్టార్ట్ చేస్తావని కేసీఆర్​పై  ధ్వజమెత్తారు.  

ALSO READ :- ధరణిలో రూ. 2 లక్షల కోట్ల కుంభకోణం : మహేశ్వర్ రెడ్డి