వాణిజ్య పంటలు వేసి బాగుపడాలి : తుమ్మల నాగేశ్వరరావు

వాణిజ్య పంటలు వేసి బాగుపడాలి : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  రైతులు వాణిజ్య పంటలు వేసి అభివృద్ధి చెందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో టమాటా పండిస్తున్న రైతు బానోతు కిషోర్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. పంట సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మార్కెటింగ్ పకడ్బందీగా చేయాలన్నారు. ఒక మార్కెట్ లో ధర తక్కువగా ఉంటే, మరో మార్కెట్ కు వెళ్లాలని సూచించారు. రవాణా కోసం సబ్సిడీపై రైతులకు వాహనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ భూమి ఉన్న రైతులు పామాయిల్ తోటలు వేయాలని సూచించారు. 

లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు చేపట్టండి

లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన గ్రంథాలయ స్థలాన్ని పరిశీలించారు. పాఠకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నూతన భవన నిర్మాణం త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట నగర పాలక సంస్థ కార్పొరేటర్ కమర్తపు మురళి, గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి ఉన్నారు.