పోలింగ్ రోజు అందరు బయటికొచ్చి ఓటెయ్యాలి.. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

పోలింగ్ రోజు అందరు బయటికొచ్చి ఓటెయ్యాలి.. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆదివారం ( నవంబర్ 2 ) టోలిచౌకిలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన మంత్రి వివేక్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై  చేశారు. చాలా మంది అపార్ట్మెంట్ వాసులు పోలింగ్ రోజు కూడా ఇళ్లలో నుంచి  బయటికి రారని.. పోలింగ్ రోజు అందరు బయటికి వచ్చి కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలని.. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. 

టోలిచౌకిలోని ఆనంద్ విహార్ అపార్ట్మెంట్స్ దగ్గర యూటర్న్ సమస్య ఉందని.. ఈ అంశాన్ని జాయింట్ కమిషనర్ కు వివరిస్తానని.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.

డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కారం చేస్తానని... నేను ఇక్కడ ఇంచార్జ్ గా ఉన్నప్పటినుంచి దాదాపు 200 కోట్లతో పనులు చేయించామని అన్నారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లు అధికారంలో ఉంటుందని.. సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. మాట ఇస్తే మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు మంత్రి వివేక్.

►ALSO READ | కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాల విడుదల.. కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం..

ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ తో పాటు ఇంచార్జ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఫాయీమ్ కురేషి, స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.