జూన్ 12లోగా మైనార్టీ విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

జూన్ 12లోగా మైనార్టీ విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : 5వ తరగతి నుంచి ఇంటర్​ఫస్టియర్​వరకు ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దగ్గరలోని మైనార్టీ విద్యాసంస్థలను సంప్రదించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో మైనార్టీ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశానికి అవగాహన కోసం రూపొందించిన వాల్​పోస్టర్​ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో 13 మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్​ఫస్టియర్ వరకు ఒక్కో తరగతిలో సుమారు 60 వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.

అర్హులైన విద్యార్థులతో ఈ సీట్లను భర్తీ చేస్తామన్నారు. జూన్ 12లోపు మైనార్టీ పాఠశాలల్లో ప్రవేశం పొందేవిధంగా అవసరమైన వారు దగ్గరలోని మైనార్టీ పాఠశాలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఇన్​చార్జి అడిషనల్ కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్ కుమార్, ఇన్​చార్జి డీఆర్​వో అశోక్ రెడ్డి, డీఆర్డీఏ శేఖర్ రెడ్డి ,చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మైనార్టీ విద్యాసంస్థల జిల్లా అధికారి విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.