కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? తీసేయాలా?

కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? తీసేయాలా?

యాసంగిలో ధాన్యం కొనేదిలేదని కేంద్రం మరోసారి చెప్పిందని రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో సమావేశం తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు మీడియాతో మాట్లాడారు.  ఎఫ్ సీఐ బియ్యాన్ని తరలించడంలేదనే విషయాన్ని గోయల్ దృష్టికి తీసుకెళ్లామని నేతలు అన్నారు. వానాకాలం కొనుగోళ్లపై కేంద్రం రాతపూర్వక హామీ ఇస్తేనే కొనుగోలు కేంద్రాలుంటాయి.  వానాకాలం పంట టార్గెట్ పోను.. ఇంకా కొనాల్సింది చాలా ఉందని కేంద్రానికి చెప్పామన్నారు. కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలా ? మూసివేయాలా ? చెప్పాలని పీయూష్ ను అడిగామన్నారు. అన్ని విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు పీయూష్ 2 రోజుల టైం అడిగారని చెప్పారు. కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామన్నారు. బీజేపీ నాయకులు తమపై అనవసర నిందలేస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.  మేం రైతులను కాపాడుకుంటామని.. వారి విషయంలో రాజకీయం చేయట్లేదని ఆయన అన్నారు.

For More News..

ఎవరాపినా యూపీ అభివృద్ధి ఆగదు

కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్

క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలు చేస్తే ఫైన్ తప్పదు