Good Health : రుచికే కాదు.. మంచి ఆరోగ్యానికీ పుదీనా ఎంతో మేలు

Good Health : రుచికే కాదు.. మంచి ఆరోగ్యానికీ పుదీనా ఎంతో మేలు

ఘాటు వాసనతో.. వంటల రుచిని పెంచే పుదీనాతో మరెన్నో లాభాలున్నాయి. వీటిని డైలీ డైట్ లో చేర్చితే బోలెడు హెల్త్ ప్రాబ్లమ్స్ కు టాటా చెప్పొచ్చు. మరి అవేంటంటే...

  • పుదీనాలోని యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు యాక్నే సమస్యల్ని తగ్గిస్తాయి.
  • సాల్సిలిక్ యాసిడ్ మొటిమలు, మచ్చల్ని మటు మాయం చేస్తుంది.
  • వీటిల్లోని విటమిన్ -ఎ కంటి సమస్యల్ని దరిచేరనివ్వదు.
  • నైట్ విజన్ ని పెంచుతుంది.
  • రోస్మరినిక్ యాసిడ్ అనే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ ఉంటుంది పుదీనాలో.
  • ఇది అలర్జీ ప్రొడ్యూసింగ్ కాంపౌండ్స్ ని బ్లాక్ చేసి అలర్జీలు రాకుండా చూస్తుంది.
  • ఆస్తమా పేషెంట్స్ కు ఉపశమనాన్ని ఇస్తుంది.
  • దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి సమస్యల నుంచి కూడా రిలాక్సేషన్ ఇస్తాయి.
  • పుదీనా రసంలో శొంఠి, జీలకర్ర పొడి కలిపి తినేముందు తాగితే ఆకలి పెరుగుతుంది.
  • ఈ రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే వాంతులు తగ్గుతాయి.
  • వాము పొడితో తీసుకుంటే కడుపులో నులి పురుగులు పోతాయి.
  • పుదీనాలో ఉండే సల్ఫర్ లంగ్స్ ను కూడా కాపాడుతుంది.
  •  గ్లాసు నీళ్లలో పుదీనా ఆకులు కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.
  • పుదీనా ఆకులు నమిలితే పళ్లు తెల్లబడతాయి.
  • చిగుళ్లు గట్టిపడి. ఆరోగ్యంగా ఉంటాయి.
  • ఫైబర్, విటమిన్-బి కాంప్లెక్స్, బీటాకెరటిన్, డాక్టర్. ఎల్ వర్షి సైకియాట్రి విటమిన్-సి, విటమిన్-ఇ, విటమిన్-కె, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్ పుష్కలంగా ఉంటాయి పుదీనాలో.
  • ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
  • పుదీనా డైజెషన్ని మెరుగుపరుస్తుంది.
  • డైజెస్టివ్ ట్రాక్ డిజార్డర్ వల్ల వచ్చే కడుపు నొప్పి, మంటను తగ్గిస్తుంది.
  • రెండు స్పూన్ల పుదీనా రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి.
  • పుదీనా రసం రెగ్యులర్గా తాగితే డిప్రెషన్, స్ట్రెస్ దూరం అవుతాయి.
  • పుదీనాలో గర్భిణీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
  • పుదీనా ఆకుల్ని డైలీ డైట్ లో చేర్చితే శరీరంలో కణుతులు పెరగకుండా ఉంటాయి.
  • పలు రకాల క్యాన్సర్లు కూడా రావు.
  • పుదీనా గొంతులో గరగరని తగ్గిస్తుంది. 

పుదీనాతో స్ట్రెస్ దూరం

పుదీనా శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే స్ట్రెస్ ని బీట్ చేయడానికి అరోమా థెరపీలోనూ పుదీనాని వాడతారు.దీనివల్ల మైండ్, బాడీ రిలాక్స్ అవుతాయి. అలాగే పుదీనాలోని అడాప్టోజెనిక్ ప్రాపర్టీలు శరీరంలో కారిస్టాల్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసి నేచురల్ గానే స్ట్రెస్ని తగ్గిస్తాయి. అందుకే రెగ్యులర్ గా పుదీనా తినాలి.