రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్


వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. శనివారం రాజన్న ఆలయ నమూనాలను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝాతో కలిసి ఈవో గెస్ట్ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరిస్తామన్నారు. ఆలయ అభివృద్ధి పనులను శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.  

అనంతరం ఆలయ పరిధిలో జీ+2 నిర్మాణాలపై ఆంక్షలు విధించే జీవో 149 రద్దుపై చర్చించారు. సమావేశంలో డీఈ రఘునందన్, ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి స్థానాచార్యులు ఎన్.ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రధాన అర్చకుడు సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉప ప్రధానార్చకుడు శరత్ 
పాల్గొన్నారు.


శృంగేరి పీఠాధిపతికి బయలుదేరిన ప్రభుత్వ విప్​, సీఎం ఓఎస్డీ

రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కర్నాటకలో శృంగేరి పీఠాధిపతుల అనుమతి కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది 
శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ శ్రీనివాస్​,  రాజన్న ఆలయ అర్చకులు, అధికారులు.. ఆదివారం రాత్రి కర్నాటకకు బయలుదేరారు.