తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సమన్యాయం, గౌరవం కల్పించాలని సూచించారు. తెలంగాణలో భద్రాచలంతోపాటు ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రాముఖ్యత ఇచ్చి గౌరవిస్తున్నామన తెలిపారు. తిరుమలలో కూడా తెలంగాణ సిఫారసు లేఖలు దర్శనాలు కేటాయించి గౌరవించాలన్నారు.
ALSO READ | పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
టీటీడీలో తెలంగాణ భక్తులకు దర్శనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిఅన్నారు. దీనిపై డిసెంబర్‌లో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.