
దేవరకొండ(కొండమల్లేపల్లి, డిండి), వెలుగు : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడ్చేసుకోవాలని ఎమ్మెల్యే బాలూనాయక్ సూచించారు. మంగళవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైస్ మిల్లుల యజమానులు సకాలంలో ధాన్యాన్ని దింపుకోవాలని చెప్పారు.
15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తోందని చెప్పారు. ప్రతి మిల్లర్ కనీసం 15 లారీలైనా అన్లోడ్చేసుకునేలా తహసీల్దార్, ఆర్ఐ పర్యవేక్షించాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.