ప్రాజెక్టుల కోసం భూములను సేకరించండి: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

ప్రాజెక్టుల కోసం భూములను సేకరించండి: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూమిని వెంటనే సేకరించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. నెట్టెంపాడు, తుమ్మిళ్ళ, గట్టు లిఫ్ట్ స్కీములకు సంబంధించి చేపడుతున్న భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ అంశాలపై ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ లో ఉన్న భూసేకరణను వేగవంతం చేసేందుకు నీటిపారుదల, రెవెన్యూ శాఖ ఆఫీసర్లు కోఆర్డినేషన్ తో పని చేయాలన్నారు. అవార్డు పూర్తయిన రైతులకు నిబంధన ప్రకారం పరిహారం చెల్లించి పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా చేస్తున్న వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు నిర్దేశిత గడువులోగా పనులు కంప్లీట్ చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్ ఈ రహీముద్దీన్  ఉన్నారు. 

ప్రత్యేక దృష్టి పెట్టండి

ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ పై దృష్టి పెట్టాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇరిగేషన్ ఆఫీసర్లకు ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పై ప్రభుత్వం డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, సంబంధిత ఆఫీసర్లు వెంటనే భూసేకరణకు కంప్లీట్ చేయాలన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేటిదొడ్డి మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​చెక్కులు అందజేశారు.