భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
  •  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్​కు బంగారు బాటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 'హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ'లో శనివారం జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ప్రముఖ బిజినెస్ కోచ్ వేణుకళ్యాణ్, ఎన్సీసీ కమాండర్ శశిరకుమార్ దాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్టలో 'హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ' నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా దేశానికి సేవ చేసే భాగ్యం విద్యార్థులకు లభించడం అదృష్టంగా భావించచ్చని పేర్కొన్నారు. డిఫెన్స్ అకాడమీ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు దేశ సేవ చేయడానికి సరైన మార్గం ఏర్పడుతుందన్నారు.