రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి పై ఖర్గేకి వివరిస్తా: జగ్గారెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి పై ఖర్గేకి వివరిస్తా: జగ్గారెడ్డి

మల్లికార్జున్ ఖర్గేని మర్యాదపూర్వకంగా కలవడానికే ఢిల్లీకి వచ్చానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆయనతో చర్చిస్తానని తెలిపారు. కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు బాగోలేవని.. సీనియర్లు, జూనియర్లకు మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పారు. దీనిపై కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‭లో టీఆర్ఎస్ నాయకుల పాత్రపై కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సి ఉందని జగ్గారెడ్డి అన్నారు. టీపీసీసీతో, సీఎల్పీ లీడర్ తో మాట్లాడి ఢిల్లీ లిక్కర్ స్కాంపై  పోరాటం చేస్తామన్నారు. 

బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ప్రచారం కొనసాగుతోందని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకుంటూ.. కాంగ్రెస్ కు ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ప్రజలకు చేరువలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు వార్తల్లో ఉండటం లేదో తెలియాలన్నారు. టీపీసీసీ నిర్ణయాల్లో కూడా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. టీపీసీసీ అందరిని కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.