
ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్లాలంటే ముందు 2 సుమోలు..గన్ మెన్లు ఉండాల్సిందే. పటిష్టమైన సేఫ్టీతో ప్రయాణం చేస్తారు. కానీ ఓ ఎమ్మెల్యే RTC బస్సులో ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అరకు MLA చెట్టి పాల్గుణ పాడేరు నుంచి పెదబయలు వరకు RTC బస్సు లో సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. మావోయిస్టుల కదలికలున్న క్రమంలో ఏజెన్సీలో MLA బస్సు పై ప్రయాణం చేయడం ఇటీవల కాలంలో ఇదే ఫస్ట టైం అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. RTC బస్సులో ప్రయాణించినవారిలో MLAతో పాటు MPP , నాయకులు ఉన్నారు.