
మునుగోడు, వెలుగు : నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను వెంటనే గుర్తించి అధికారులకు తెలియజేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీశ్రేణులకు సూచించారు. బుధవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చండూరు పోలీస్ డివిజన్ ఏర్పాటు, గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ కు ఎఫ్ఐఆర్ అథారిటీ వెంటనే కల్పించాలని డీజీపీకి ఎమ్మెల్యే ఫోన్ చేసి కోరారు.
మునుగోడు టౌన్ నుంచి వయా దుబ్బకాల్వ– లక్ష్మీదేవిగూడెం రోడ్డును పూర్తిచేయాలని పంచాయతీరాజ్ఈఈకి సూచించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నెలకొన్న కరెంటు సమస్యను గుర్తించి నివేదిక ఇవ్వాలని ముఖ్యనాయకులను ఆదేశించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, మన పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, గట్టుప్పల్ మండల అధ్యక్షులు జగన్నాథం, నాయకులు పాల్గొన్నారు.