భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన నెల జీతాన్ని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంతరెడ్డికి అందజేశారు.
గురువారం సచివాలయంలో సీఎంను కలిసిన కూనంనేని మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.