జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్ది

జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్ది

యాదాద్రి, వెలుగు: వర్కింగ్‌ జర్నలిస్టులందరికి రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్ది హామీ ఇచ్చారు. భువనగిరిలోని క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ కమిటీ జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు ఆధ్వర్యంలో ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.   ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌రెడ్డి  మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులకు రెండో విడత ఇందిరమ్మ జాబితాలో  ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త భట్టు రామచంద్రయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్, యూనియన్‌ ప్రతినిధులు  కందుకూరి సోమయ్య, పాశం నవీన్, పత్తిపాటి ఆనంద్, ఆరె కుమార్, ఎండీ జమాలోద్దీన్, బొడిగే దిలిప్ గౌడ్, సతీష్, టీజేయూ అధ్యక్షుడు  షానూర్‌ బాబా తదితరులున్నారు. 

భువనగిరి అభివృద్ధికి ఫండ్స్​ 

యాదాద్రి, వెలుగు:  భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఫండ్స్​తెస్తున్నామని ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి అన్నారు. భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాఫీసర్లు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలతో మీటింగ్​నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..  బునాదిగాని, ధర్మారెడ్డి కాల్వల కోసం రూ. 500 కోట్లు మంజూరు చేయించామన్నారు.

 ఈ రెండు కాల్వల వర్క్స్​ కొనసాగుతున్నాయని చెప్పారు. భువనగిరి టౌన్​లోని జగదేవ్​పూర్​ రోడ్డుతో పాటు బ్రిడ్జి మరమ్మత్తుల కోసం రూ. 7 కోట్లతో ఎస్టిమేట్​ రెడీగా ఉందన్నారు. భువనగిరి మున్సిపాలిటీ కోసం హెచ్​ఎండీఏ నుంచి రూ. 16 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కర్​రావు, ట్రాఫిక్​ ఏసీపీ ప్రభాకర్​ రెడ్డి తదితరులు ఉన్నారు.