ఎస్సారెస్పీ నీటిని వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే మందుల సామెల్

ఎస్సారెస్పీ నీటిని వినియోగించుకోవాలి :  ఎమ్మెల్యే మందుల సామెల్
  •     ఎమ్మెల్యే మందుల సామెల్ 

తుంగతుర్తి, వెలుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా కొడకండ్ల రిజర్వాయర్ నుంచి ఎస్సారెస్పీ స్టేజ్2 ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి మాట్లాడారు. వారబందీ పద్ధతి జలాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు.  

రైతులు నీటిని వృథా కాకుండా ఉపయోగించుకోవాలన్నారు.  రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు చివరి ఎకరా వరకు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్ నాయకులు, ఎస్సారెస్పీ ఆఫీసర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.