ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. జనగామ నుండి సిద్దిపేట వైపు జరుగుతున్న, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్కడి చెట్లని నరికి వేశారు. అయితే నరికిన చెట్లు అన్నీ రోడ్లపైనే పడిపోయాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కారు దిగి.. తన సిబ్బందితో కలసి రోడ్డుపై ఉన్న చెట్లను తొలగించారు. ఆ తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు.