
కోదాడ, వెలుగు : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కోదాడ మార్కెట్ కమిటీ లో కమిటీ అభివృద్ధి పై అధికారులు, పాలకవర్గంతో సమావేశం నిర్వహించారు