కామారెడ్డి రైతులకు రఘునందన్ రావు మద్దతు

కామారెడ్డి రైతులకు రఘునందన్ రావు మద్దతు

కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించ్చారు. బుధవారం శవాన్ని అడ్డుకున్నట్టు ఇవాళ ఉండదని డీఎస్పీని హెచ్చరించారు.

మరోవైపు రాములు మృతికి సంతాపంగా రైతులు మౌనం పాటిస్తుండగా అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డి వారు దాడికి యత్నించారు. రాజీనామా చేయకుండా ర్యాలీ వద్దకు ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను సముదాయించారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా భూమి కోల్పోతామన్న భయంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వేదనకు గురైన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉపసర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పీఏసీఎస్ డైరెక్టర్, ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు పదవులు వదులుకున్నారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.