నాగనూలు రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి

నాగనూలు రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి కృషి :  ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, నాగనూలు రోడ్డులో లోలెవెల్​బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి తెలిపారు. శనివారం నాగనూలు, ఉయ్యాలవాడ–తిరుమలాపూర్ వెళ్లే రోడ్లను పరిశీలించారు. ఉయ్యాలవాడ–తిరుమలాపూర్ రోడ్డును రిపేర్​ చేయించాలని ఈఈ విజయ్ కుమార్ ను ఆదేశించారు.

 గుడిపల్లిలో కేఎల్ఐ కాల్వలకు లైనింగ్ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఇండ్లలోకి చేరుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాల్వల లైనింగ్ కోసం అంచనాలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు.