నేను ఎమ్మెల్యే అయ్యాకనే ఇండ్ల స్థలాలకు పట్టాలు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

నేను ఎమ్మెల్యే అయ్యాకనే ఇండ్ల స్థలాలకు పట్టాలు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
  •     ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

తిమ్మాపూర్, వెలుగు : గత ప్రభుత్వాల హయాంలో పేదలు గుడిసెల్లో జీవించారని, తాను ఎమ్మెల్యే అయ్యాకనే వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలకు పట్టాలు వచ్చాయని  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్​ మండలం మొగిలిపాలెం, నేదునూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు ఇవ్వని పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో నేదునూర్ సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ కొమురయ్య, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జితేందర్ రెడ్డి, వైస్​ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, లీడర్లు దేవేందర్ రెడ్డి, సర్పంచులు వెంకటేశ్వరరావు, అంజయ్య పాల్గొన్నారు.  

కాగా మొగిలిపాలెంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా స్థానిక సర్పంచ్​ సుస్మిత రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. దీనిపై ఆమె మాట్లాడుతూ తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్​ కావడం వల్లే తనను పిలవకుండా అవమానించారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు సమస్య చెప్పుకునేందుకు వస్తే పోలీసులు తమను నెట్టేశారని కాంగ్రెస్​ ఎస్సీ సెల్ ​మండలాధ్యక్షుడు రెడ్డిగారి రాజుతోపాటు పలువురు లీడర్లు ఆరోపించారు. నేదునూర్ ​గ్రామంలో పవర్​ ప్లాంట్​ కోసం భూములు కోల్పోయి జీవనోపాధి లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.