పోస్టల్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : తెల్లం వెంకట్రావు

పోస్టల్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : తెల్లం వెంకట్రావు
  • ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 

భద్రాచలం, వెలుగు : పోస్టల్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం నిర్వహించిన నేషనల్ అసోషియేషన్​ ఆఫ్​ పోస్టల్​ ఎంప్లాయీస్​ గ్రూప్​ సి 5వ వార్షికోత్సవ మహాసభలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోస్టల్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అర్హత ఉన్న వారికి అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్​ వీరభద్రస్వామి మాట్లాడుతూ..మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు తమ ఆలోచన విధానాలను మార్చుకుని డిపార్ట్​మెంట్​అభ్యున్నతికి తోడ్పడాలన్నారు. ఈ మహాసభలో ఎన్​ఏపీఈ గ్రూప్​ సీ ఆల్​ఇండియా మాజీ కార్యదర్శి కిషన్​రావు, ఎఫ్​ఎన్​పీవో సెక్రటరీ జనరల్​ వాసిరెడ్డి శివాజీ, ఐఎన్​టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలీల్​లు పాల్గొన్నారు.