రాహుల్ ప్రధాని అయితే.. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..

రాహుల్ ప్రధాని అయితే.. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..

గోదావరిఖని బృందావన్ గార్డెన్ లో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్  ఐఎన్ టియుసి మహాసభ మరియు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి,గడ్డం వినోద్,మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్,ఐఎన్ టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి మాట్లాడుతూ, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు జరుగుతుందని అన్నారు వివేక్ వెంకటస్వామి.

సింగరేణి సంస్థలు కొత్త బొగ్గు గనులు రావలసిన అవసరం ఉందని,నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సి అండ్ ఎండి తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడం జరిగిందని అన్నారు. జైపూర్ లో మరో 1100 మెగావాట్ల విద్యుత్ కర్మాగారాన్ని నెలకొల్పోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.