హైదరాబాద్, వెలుగు: ఫిన్టెక్ కంపెనీ వన్ మోబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఆర్‌బీఐ నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ దక్కించుకుంది. దీని ద్వారా మోబిక్విక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త లోన్ విభాగాన్ని ప్రారంభిస్తోంది. 18.6 కోట్లకుపైగా కస్టమర్ల బేస్ ఉన్న ఈ సంస్థ వినియోగదారులు, ఎంఎస్ఎంఈలకు వినూత్న క్రెడిట్ ఉత్పత్తులను అందించనుంది.
ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఆర్థిక సమ్మిళితం పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్‌బీఐ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందిన తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. ఏఐ, ఎంఎల్ టెక్నాలజీల ద్వారా వ్యక్తిగతీకరించిన ఆర్థిక సేవలను దేశవ్యాప్తంగా అందిస్తామని మోబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు ఉపాసన టాకు తెలిపారు.

