మళ్లీ ఊపందుకున్న సబ్బులు, షాంపూల సేల్స్

మళ్లీ ఊపందుకున్న సబ్బులు, షాంపూల సేల్స్

న్యూఢిల్లీ: చాలా రాష్ట్రాలు లాక్​డౌన్లను ఎత్తివేస్తుండటంతో సబ్బులు, షాంపూలు, టూత్​పేస్టులు వంటి ఫాస్ట్​  మూవింగ్​ కన్జూమర్​ గూడ్స్​ అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి. దీంతో జూన్​ మొదటి రెండు వారాలలో ఎఫ్​ఎంసీజీ ప్రొడక్ట్స్​ సేల్స్​  అంతకు ముందు నెలతో పోలిస్తే 15 శాతం పెరిగాయి. కిరాణా దుకాణాలు తిరిగి తెరవడం కూడా అమ్మకాల జోరుకు సాయపడుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కిరాణా షాపుల వల్ల సేల్స్​ 28 శాతం దాకా పెరిగాయని పేర్కొంటున్నాయి. అంతకు ముందు రెండు నెలల్లో ట్రెండ్​ ఇందుకు భిన్నంగా ఉందని వెల్లడించాయి. దేశంలోని 75 లక్షల రిటెయిల్​ స్టోర్ల అమ్మకాలను ట్రాక్​ చేసే బిజోమ్​ ఈ డేటాను రిలీజ్​ చేసింది.
దీపావళి దాకా ఢోకా ఉండదు....
మార్కెట్​ మళ్లీ ఊపందుకుందని, దీపావళి దాకా జోరుకు ఢోకా ఉండదని పార్లే ప్రొడక్ట్స్​ కేటగిరీ హెడ్​ బుద్ధా కృష్ణారావు చెప్పారు. ఎకానమీ రీ ఓపెన్​ అయ్యే కొద్దీ గ్రోత్​ అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. మాన్సూన్​ అనుకూలంగా ఉండటం కూడా ప్లస్​ పాయింటేనని చెప్పారు. అన్​లాక్​తో గ్రామాలలోనూ గ్రోసరీలు, ఎసెన్షియల్స్​ వినియోగం లాక్​డౌన్​ ముందు లెవెల్స్​కు చేరుతోందని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు అన్​లాక్​ అవుతుండటంతో చ్యవన్​ప్రాశ్​, హనీ వంటి ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్​ డిమాండ్​ పెరుగుతున్నట్లు డాబర్​ వెల్లడించింది. హెల్త్​కేర్​ పోర్ట్​ఫోలియో అమ్మకాలు పెరుగుతున్నాయి. రూరల్​ ఇండియాలోనూ ఇదే ట్రెండ్​ కనిపిస్తోందని డాబర్​ ఇండియా ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ (సేల్స్​) ఆదర్శ్​ శర్మ చెప్పారు. కొవిడ్​–19 కేసుల తగ్గుదల కన్జూమర్​ సెంట్​మెంట్​ను బూస్ట్​ చేస్తోందని అన్నారు. అలాగే, సప్లయ్​ చెయిన్​లో ఏర్పడిన ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయని పేర్కొన్నారు. సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​ ఎక్కువవడంతో ఏప్రిల్​ నుంచి కొన్ని మార్కెట్లలో లాక్​డౌన్​ మొదలయింది. కిందటి నెలలోనైతే రెండు డజన్ల రాష్ట్రాలలో రెస్ట్రిక్షన్లు, నైట్​ కర్ఫ్యూ అమలులో ఉన్నాయి. దాంతో మార్కెట్​ మూడో వంతుకు పడిపోయింది.  షాపులు క్లోజ్‌ అయి ఉండడంతో డిమాండ్ పడిపోయింది. 
రెండంకెల గ్రోత్​......
అన్ని ఎఫ్​ఎంసీజీ కేటగిరీలలోని ప్రొడక్ట్స్​ అమ్మకాలూ రెండంకెల గ్రోత్​ను జూన్​ మొదటి రెండు వారాలలో సాధించాయని మొబిసీ టెక్నాలజీస్​ చీఫ్​ మార్కెటింగ్​ ఆఫీసర్​ అక్షయ్​ డిసౌజా చెప్పారు. బిజోమ్​ ఈ కంపెనీదే. రికవరీ మరింత పటిష్టంగా ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. హోమ్​కేర్​, ప్యాకేజ్డ్​ ఫుడ్స్​ అమ్మకాలైతే మార్చి కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. హైజీన్​, హోమ్​ కన్సంప్షన్​కు సెకండ్​వేవ్​ మేలు చేసింది. కానీ,  హోటల్స్​, రెస్టారెంట్లు, కేటరింగ్​ బిజినెస్​లను మాత్రం బాగా దెబ్బకొట్టిందని ఎనలిస్టులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో తప్ప మిగిలిన ప్రాంతాలలో హోటళ్లు, రెస్టారెంట్ల బిజినెస్​లు రికవరీ అవుతున్నాయని అదాని విల్​మార్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ అంగ్​శు మాలిక్​ చెప్పారు.