చింపాంజీ చేష్టలు..తప్పే

చింపాంజీ చేష్టలు..తప్పే

కోతి, చింపాంజీ, గొరిల్లా లు మిగతా జంతువులతో పోలిస్తే కొంచెం తెలివైనవి. వాటికి ఏదైనా నేర్పిస్తే త్వరగా నేర్చుకుం టాయి. ఒక్కోసారి మనుషుల్ని దగ్గరి నుంచి చూసి అనుకరిస్తుంటాయి. అప్పుడప్పుడు అవి చేసే ఫీట్లు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక అసలు విషయానికొస్తే.. ఓ చింపాంజీ ఫోన్‌ లో ఇన్‌ స్టాగ్రామ్‌ చూస్తున్న వీడియో ఒకటి ఈ మధ్య బాగా వైరల్‌ అయ్యింది. అది తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూస్తూ టైంపాస్ చేస్తోంది.‘రియల్‌ టార్జాన్‌   మైక్ హాల్‌ స్టన్ ఆ వీడియోను ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా మిలియన్నర వ్యూస్‌‌ పైగా వచ్చాయి. అచ్చం మనిషి లాగే అది ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు ‘ఔరా’ అనుకుంటున్నారు. ‘ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌‌’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ ‘మనుషుల అంతం దగ్గర పడిందంటూ…’ ఫన్నీ కామెంట్ లు చేస్తున్నారు. అయితే యానిమల్‌ ఎక్స్‌‌పర్ట్‌‌ డాక్టర్‌‌ జాన్‌ గుడ్‌ ఆల్‌ మాత్రం ఈ వీడియోపై మండిపడుతున్నాడు. చింపాజీలు హైలీ సోషల్ యానిమల్స్‌‌.చాలా తెలివైనవి. మనుషుల్లా భావోద్వేగాలను ప్రదర్శించే సామర్థ్యం వాటికుంది. కానీ, ఎమోషన్స్‌‌ పేరిట వాటితో ఆడుకోకూడదు. వాటికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేయకూడదు. ఆ పనులు వాటి మానసిక, శారీరక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటిలో దూకుడు స్వభావం పెరిగిపోతుంది. ఫలితంగా విపరీత అనర్థాలకు దారితీస్తుంది. మూగ జీవాల సరదా ఫొటోలు/వీడియోలు పోస్ట్‌‌గానీ, షేర్‌‌ కానీ చేయడం తప్పేం కాదు. కానీ, సోషల్ మీడియాలో ఇలా ప్రమోషన్ల కోసం వాడుకోవడం చట్టపరంగా నేరం’అని గుడ్‌ ఆల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వీడియోలోని చింపాంజీ సౌత్‌ కరోలినాలోని ఓ సఫారీలో ఆశ్రయం పొందుతోంది. ఈ సఫారీలోని జంతువులను హింసిస్తు న్నట్లు  గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు వేలకుపైగా ఏప్స్‌‌ అడవుల నుంచి మాయమవుతున్నట్లు అధికారగణాం కాలు చెప్తున్నాయి.