వీడియో : రైల్వే ఆఫీసులో కంప్యూటర్ వర్క్ చేస్తున్న కోతి.. యాక్సిడెంట్లు జరక్క ఏమవుతాయి..!

వీడియో : రైల్వే ఆఫీసులో కంప్యూటర్ వర్క్ చేస్తున్న కోతి.. యాక్సిడెంట్లు జరక్క ఏమవుతాయి..!

సాధారణంగా కోతులు (Monkeys) చాలా తెలివైనవి. మనుషులను అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఒక్కోసారి వాటి ప్రవర్తన చూస్తే పూర్తిగా మనుషులను పోలి ఉంటుంది. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యాయి. తాజాగా మరో ఫన్నీ వీడియో (Funny Video) నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కోతి కంప్యూటర్ ముందు కూర్చుని ఓ ఉద్యోగిలా సీరియస్‌గా పని చేస్తోంది. ఆ వీడియో చూసిన చాలా మంది నవ్వుకుంటున్నారు.కోతులను( Monkey ) మనుషుల తర్వాత అత్యంత తెలివైన వాటిగా పరిగణిస్తారు.ఇవి చాలా వరకు మనుషులు లాగానే ప్రవర్తిస్తాయి.అలాగే తెలివిగా నడుచుకుంటాయి.వీటి స్మార్ట్‌నెస్ ను చూపించే వీడియోలు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ కోతి కంప్యూటర్ ముందు కూర్చొని ఒక డెడికేటెడ్ ఎంప్లాయ్ లాగా పని చేస్తూ ఉండడం చూడవచ్చు.ఈ కోతి కంప్యూటర్ ముందు మనిషిలాగా కూర్చుని కీబోర్డ్( Keyboard ) పై టైప్ చేయడం చూసి చాలామంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

@the_heavy_locopilot అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు లో ఈ వీడియో షేర్ చేసినప్పటినుంచి ఈ వీడియో 3 వేల  కంటే ఎక్కువ వ్యూస్, అనేక లైక్‌లను పొందింది . ఈ వీడియోలో  రైల్వే స్టేషన్‌ ఎంక్వయిరీ కౌంటర్ రూమ్‌లోకి ప్రవేశించడం గమనించవచ్చు. తర్వాత అది తనకు ఏదో కంప్యూటర్ స్కిల్స్ ఉన్నట్లు దాని ముందు కూర్చుని చాలా సీరియస్‌గా కీ బోర్డు నొక్కడం స్టార్ట్ చేసింది.  అక్కడే డెస్క్‌లో ఉన్న ఓ వ్యక్తి చేసే పనిని అనుకరించడం కనిపిస్తుంది. పేపర్లను సీరియస్ గా వెతుకుతూ.. కీ బోర్డ్ లో ఏదో టైప్ చేస్తూ.. పెద్ద పనిమంతురాలిగా కనిపిస్తుంది.అక్కడే ఉన్నవారు ఈ కోతి చేష్టలను వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

పోస్ట్ లో చెప్పిన దాని ప్రకారం ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్ ఎంక్వైరీ ఆఫీసులో వెలుగు చూసింది. ఈ క్లిప్‌లో, కోతి చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయిన జనాలు దాని చుట్టూ గుమిగూడి, అది చేస్తున్న పనిని గమనిస్తున్నారు. ఆ కోతి చేసే సీరియస్ పని చూసి వారు నవ్వుకోవడం, కోతి చేష్టలను స్వాగతించడం వినబడుతుంది.  ఈ వీడియో వైరల్ కావడంతో ..వినియోగదారులు నవ్వుతున్న ఎమోజీలు, సరదా కామెంట్స్ తో వెల్లువెత్తిస్తున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. సమర్థవంతమైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన లంగూర్ అంటే.. కొత్త రిక్విప్‌మెంట్ స్టేషన్ మాస్టర్ అని మరొకరు సరదా పడ్డారు. మన పూర్వీకులే అనేది మరోసారి నిరూపించబడింది అని మరొకరు చమత్కరించారు.