24 గంటల్లో.. దేశంలో 21 వేలు దాటిన కరోనా కేసులు

24 గంటల్లో.. దేశంలో 21 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 21వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.25శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,07,360 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా  21,566  కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు - 4.25 శాతం. 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారు. రికవరీ రేటు - 98.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,881 యాక్టివ్‌ కేసులు - ఉన్నాయి. గత 24 గంటల్లో - 45 మంది కరోనా మృతి చెందారు. 24 గంటల్లో  29.12 లక్షల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.