తెలంగాణలో టూర్ కి సూపర్ ప్లేస్

తెలంగాణలో టూర్ కి  సూపర్ ప్లేస్

టూర్​కు​ వెళ్లాలి అనిపించగానే పచ్చదనం, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఉండే పల్లెటూళ్లు కళ్లముందు మెదులుతాయి. అలాంటి ప్లేస్​లు మనసుకి హాయినివ్వడమే కాదు. ఒకలాంటి థ్రిల్లింగ్​ ఫీలింగ్​ ఇస్తాయి. టూరిస్టులకి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాల్ని అందించే  ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వీకెండ్స్​లో టూర్​ వెళ్లడానికి నల్లమల అడవి మధ్యలో ఉన్న అమర గిరి అనే పల్లెటూరు బెస్ట్​ ఆప్షన్​. ‘తెలంగాణ ఊటీ’గా పిలిచే ఈ ఊరు నాగర్​ కర్నూల్​ జిల్లా, కొల్లాపూర్​ మండలంలో ఉంది.

కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ ఊళ్లో ఒకప్పుడు రుషులు తపస్సు చేసి అమరత్వం పొందారట. అందుకే ‘అమరగిరి’ అని పేరు వచ్చిందని చెప్తారు ఆ ఊరి వాళ్లు. పచ్చదనం పరుచుకున్న కొండలు, పెద్దపెద్ద చెట్లు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణం... ఇవన్నీ అమరగిరి సొంతం. కొల్లాపూర్​ నుంచి అమరగిరికి కొండ ప్రాంతం గుండా వెళ్తుంటే థ్రిల్లింగ్​గా ఉంటుంది. ఇక్కడ పారే కృష్ణా నది మధ్యలో ఐలాండ్ ఉంటుంది. అక్కడికి పడవలో వెళ్లొచ్చు. ఐలాండ్​​లో అంకాలమ్మ కోట, మల్లయ్య సెల అనే పేరుతో పిలిచే గుళ్లు ఉంటాయి. సోమ, మంగళ, శుక్రవారాల్లో భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.  ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి పడవలో షికారు చేస్తూ, అలల అందాల్ని చూస్తూ సరదాగా గడిపేందుకు అమరగిరి బాగుంటుంది. 

ఇలా వెళ్లాలి
కొల్లాపూర్​ నుంచి ఘాట్​ రోడ్డు గుండా 8 కిలో మీటర్లు  జర్నీ చేస్తే అమరగిరి చేరుకోవచ్చు. నాగర్​కర్నూల్​ నుంచి దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి అయితే  126 కి.మీ.