కొత్తగూడెం బల్దియాలో.. వీగిన అవిశ్వాసం

కొత్తగూడెం బల్దియాలో..  వీగిన అవిశ్వాసం

చుంచుపల్లి, వెలుగు : కొత్తగూడెం మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపు సీతాలక్ష్మి పై సొంత పార్టీకే చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ  గత నెల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసు ఇచ్చారు.  అవిశ్వాసంపై  కొత్తగూడెం ఆర్డీవో మధు సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవిశ్వాసానికి మద్దతుగా తొలుత 22 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు సంతకాలు చేశారు.

 అందులో కొందరు కౌన్సిలర్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ కండువా కప్పుకున్నారు.  అవిశ్వాసంపై ఓటింగ్​ నిర్వహించాలంటే   2/3  కోరం ఉండాలి.  ఈ లెక్కన  25 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సిఉండగా  ఒక్క  ఇండిపెండెంట్  కౌన్సిలర్ మాత్రమే హాజరయ్యారు.   ఆర్డీఓ  సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా  అప్పుడు కూడా కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. 22 మంది అవిశ్వాసం ప్రకటించగా అందులో కొందరు మళ్లీ  చైర్​పర్సన్​ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో అవిశ్వాసం నెగ్గే అవకాశం లేదని తెలిసి అసమ్మతి కౌన్సిలర్లు మీటింగ్​కు   డుమ్మా కొట్టారు.  నెలరోజులుగా ఉత్కంఠ రేపిన అవిశ్వాస వ్యవహారం చివరికి తుస్సుమంది.