తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : అర్వింద్

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : అర్వింద్

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు ఎంపీ. కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్.  రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి ఉంటుందని చెప్పారు.  రైతులంతా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలన్న అర్వింద్.. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అందరూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  

రైతులకు సమస్యలు సృష్టించింది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు అర్వింద్.  కేసీఆర్ గొర్లు మింగేటోడు అయితే రేవంత్ రెడ్డి బర్లు మింగేటోడని ఎద్దేవా చేశారు.  టీడీపీ రాష్ట్రంలో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు.  డిసెంబర్ 4వ తేదీన 20 మంది కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే లుగా పోటీ చేసే వాళ్ళు బీఆర్ఎస్ లో చేరతారని చెప్పారు. అందుకే రైతుల ఓట్లు వృధా కాకుండా బీజేపీని గెలిపించాలని కోరారు.  

దేశంలో చెరకు ఫ్యాక్టరీలు ఏ రకంగా నడపాలో కేంద్ర ప్రభుత్వానికి ఒక పాలసీ ఉందన్నారు అర్వింద్.  బీజేపీప్రభుత్వం ప్రణాళిక బద్ద పాలసీలతో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి నడిపిస్తుందన్నారు.  మూతపడ్డ చాలా  ఫ్యాక్టరీలను రాష్ట్రాలలో తెరిపించామన్నారు. పసుపు బోర్డు కాస్త ఆలస్యమైన ఇచ్చిన మాట ప్రకారం నేరవేర్చమని చెప్పారు.   బీడీ కార్మికుల సమస్యలు బాగా ఉన్నాయని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.  

ALSO READ :- గుంటూరు కారం సాంగ్ లీక్!.. సోషల్ మీడియా షేక్