షమీని టార్గెట్ చేయడంపై ఒవైసీ సీరియస్

షమీని టార్గెట్ చేయడంపై ఒవైసీ సీరియస్

హైదరాబాద్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఊహించినంత ఆసక్తిగా సాగలేదు. టీమిండియా బ్యాట్స్‌మన్ ఫర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా నిరాశపర్చారు. దీంతో పాక్ చేతిలో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత పేసర్ మహ్మద్ షమీని టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టడం వివాదాస్పదం అవుతోంది. ఈ విషయంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. టీమిండియా ఓటమికి షమి ఒక్కడ్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని ఒవైసీ అన్నారు. ఓటమికి అతడ్ని ఒక్కడినే కారణంగా చూపడం కరెక్ట్ కాదన్నారు. షమీని టార్గెట్‌‌గా సోషల్ మీడియాలో ముస్లింల మీద విద్వేషంతో కూడిన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ‘క్రికెట్‌లో గెలుపోటములు సహజం. టీమ్‌లో 11 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఒక్క షమీనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఖండిస్తుందా’ అని ఒవైసీ ప్రశ్నించారు.  

మరిన్ని వార్తల కోసం: 

సిద్ధూ వల్ల కాంగ్రెస్ పార్టీ కామెడీ షోలా మారింది: హర్‌సిమ్రత్ కౌర్

పేదల సంక్షేమమే మా లక్ష్యం: మోడీ

మాస్కు దవడకు కాదు ముక్కుకు పెట్టుకోవాలి: మమతా బెనర్జీ